పాల్వంచ పట్టణనికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16) రెండేళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వివిధ ఆసుపత్రుల్లో చూపించినా తగ్గలేదు. ఈ నెల 15న కడుపునొప్పి రావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు.