పాల్వంచ శివానగర్ కు చెందిన వై. విద్యాసాగర్(57) సెక్యూరిటీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఆయన ఆరోగ్యం సరిగా లేదు. మనస్తాపానికి గురై ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకున్నారు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు ఉన్నారు.