కొత్తగూడెం జిల్లా కోర్టులో జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబోలు రాంప్రసాద్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2023 - 2024 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించుటకు జనరల్ బాడీ ఏకగ్రీవంగా తీర్మానించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రధాన అధికారిగా సినియర్ న్యాయవాది పలివెల గణేష్ బాబు, ఎన్నికల సహాయ అధికారులుగా జీకే. అన్నపూర్ణ, మెండు రాజమల్లు, పాల రాజశేఖర్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అనుబ్రోలు రాంప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కోశాధికారి మహ్మద్ సాదిక్ పాషా, గ్రంథాలయ కార్యదర్శి ఆర్తి మక్కాడ్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.