భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం కాలని నందు కిన్నెరసాని వరద ప్రభావం వల్ల కొట్టుకుపోయిన పంట పొలాలను అధికారుల బృందంతో మంగళవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించినారు. జరిగిన పంట నష్టాన్ని, కొట్టుకుపోయిన చెక్ డాం ను ఎస్టిమేట్ వేయాలని, వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు అందవలసిన తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించినారు.