రాఖీ పండుగను పురస్కరించుకుని సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రక్షబంధన్ వేడుకలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ జి.వినిత్కు ఎస్పీ కార్యాలయంలో గురువారం రాఖీ కట్టారు. పోలీసు యంత్రాంగం అన్ని వేళల్లో మహిళాలకు అందుబాటులో ఉండి, మహిళలకు రక్షణ కల్పిస్తున్నరని ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ జయమ్మ తెలిపారు.