ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం అన్నారు. ఈనెల 19న వరంగల్లో నిర్వహించే ప్రజా పాలన- విజయోత్సవాల వేడుకలకు జిల్లా నుంచి 12 బస్సుల్లో బస్సుకు 45 మంది చొప్పున 540 మంది మహిళ సంఘాల సభ్యులు కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.