సమయపాలనతో విధులు నిర్వహించాలని ఎంఈఓ ప్రభు దయాల్ సూచించారు. కొత్తగూడెం మండల విద్యావనరుల కేంద్రంలో సిబ్బందితో ఎంఇఓ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి సిబ్బందికి సూచనలు చేశారు. మండల పరిధిలోని పాఠశాలల సమాచారాన్ని కేంద్రీకరిస్తూ ప్రభుత్వం అడిగే సమాచారం, రిపోర్టులను వెంటనే సరైన వివరాలతో పంపాలన్నారు.