కొత్తగూడెం కలెక్టరేట్లో ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై ప్రతి అధికారి కూడా స్పందించాలని ఆయన తెలిపారు.