మెరుగైన జీవనశైలితో మానసిక ఆరోగ్యం సాధించవచ్చునని డీఎంహెచ్ భాస్కర్నాయక్ అన్నారు. ఆరోగ్యకర జీవన విధానానికి వ్యాయామం, పరిమిత ఆహారం అవసరమని తెలిపారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఒత్తిడిని తగ్గించుకోడానికి ధ్యానం, యోగా సాధన చేయాలన్నారు.