సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే ఈఎస్ఐ అమలు చేయాలి అని ఏఐటియుసీ రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య ఉపాధ్యక్షులు కిష్టాఫర్ లు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని హెడ్ ఆఫీస్, మెయిన్ హాస్పిటల్ మరియు బంగ్లోస్ వద్ద సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.