జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఆదివారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటింటి సర్వే చేపట్టిందని చెప్పారు. ఈ సర్వే ద్వారా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారం తెలుస్తుందని చెప్పారు. ఆ తర్వాత సంక్షేమ పథకాల అమలు సులభతరం అవుతుందని వెల్లడించారు.