జూలూరుపాడు గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ రాణా ప్రతాప్ సింగ్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులకు గురువారం సూచించారు. ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని ఆయన తెలిపారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాల్లో చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను అనుమతించొద్దని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.