ఆపద సమయంలో సహయం కోసం సంప్రదించండి: లావణ్య

2874பார்த்தது
ఆపద సమయంలో సహయం కోసం సంప్రదించండి: లావణ్య
సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ చుంచూపల్లి మండల కార్యవర్గ సభ్యురాలిగా మాడే లావణ్య ను నియమిస్తు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ &వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు నియమకపు ఉత్తర్వులు అందుకున్నట్లు లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. మాడే. లావణ్య మాట్లాడుతూ మహిళ సాధికారత కోసం, ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ అందించడం కోసం, సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ పని చేస్తుందని, తన పై నమ్మకం తో తనకు భాధ్యులు అప్పచెప్పిన సఖీ జాతీయ అధ్యక్షురాలు సుష్మా రారియన్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ సల్మా, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్, కొప్పెర కవిత లకు లావణ్య కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఆపద సమయంలో న్యాయ సహయం కోసం తమను సంప్రదించాలని లావణ్య విజ్ఞప్తి చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி