భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో నూతనంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ను సోమవారం వర్చువల్ విధానంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి. నవీన్ రావ్ ప్రారంభించారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కొత్తగూడెంలో చీప్ లీగల్ ఎయిడ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ గా నలుగురు న్యాయవాదులు నియమించబడ్డారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆర్థికంగ దిగువ రేఖకు ఉండి ఎవరైతే న్యాయవాదిని నియమించుకోలేని స్తోమతను కలిగి ఉండి ఉచిత న్యాయం కొరకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా త్వరితగతిన వారికి న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.