భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్ ఇండియా లాయర్స్ యునియన్ (ఐలు) జిల్లా ప్రథమ మహాసభ భద్రాచలం పట్టణంలో నిర్వహించారు. ఈ మహాసభలో ఐలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కొత్తగూడెం న్యాయవాది మహ్మద్ సాదిక్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాదిక్ పాషా మాట్లాడుతూ న్యాయవాదుల అభ్యున్నతికోసం, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని, తనపై నమ్మకంతో భాధ్యతను ఇచ్చిన ఐలు రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జలసుత్రం శివరాం ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ కు సాదిక్ పాషా కృతజ్ఞతలు తెలియజేశారు. సాదిక్ ఎన్నిక పట్ల కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.