గృహాలలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపారాలకు ఉపయోగించకూడదని కొత్తగూడెం సివిల్ సప్లై డిటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండల కేంద్రంలోని హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం హోటల్ యజమానులతో మాట్లాడుతూ. తెలిసి తెలియక ఇండ్లలో వాడే గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే తప్పును సరిచేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.