చుంచుపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేను తహశీల్దార్ పి. కృష్ణ, ఎంపీడీవో అశోక్ శుక్రవారం పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను నమోదు చేసుకోవాలని కుటుంబ సభ్యుల వివరాలు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకొని నమోదు చేయాలని సూచించారు. ప్రజలు కూడా తమ వద్ద ఉన్న సరైన ఆధార పత్రాలను చూపించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు.