మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని రామవరం, మదీన మజ్జీత్ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజ్ అనంతరం నిర్వహించిన మిలాదున్ నబి ర్యాలీ లో అహలే సున్నత్ జమాత్ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యం. ఏ. రజాక్, డిస్ట్రిక్ట్ మైనారిటీ సంక్షేమ అధికారి కే. సంజీవరావు అతిథులుగా పాల్గొన్నారు. రామవరం 14 నెంబర్ లో గల మదీన మజ్జీత్ నుండి రామవరం మార్కెట్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో మజ్జీత్ కమిటీ అధ్యక్షులు మరియు మజ్జీత్ కమిటీ కార్యవర్గం, అహలే సున్నత్ జమాత్ భద్రాది కొత్తగూడెం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు అమీర్ ఖాద్రి, ప్రథాన కార్యదర్శి యఖుబ్ ఖాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ యూసుఫ్, కోశాధికారి సయ్యద్ యఖుబ్ ఉద్దీన్, ఉర్దూఘర్ ఛైర్మన్ యస్కే అన్వర్ పాష, యువజన విభాగం అధ్యక్షుడు అస్లాం, హమీద్, ఎఎస్జే నాయకులు కోఆప్షన్ సభ్యులు ఆరీఫ్ ఖాన్, ఎఎస్జే రామవరం శాఖ కార్యదర్శి షమీ , రామవరం, కొత్తగూడెం ముస్లిం సోదరులు పాల్గొన్నారు.