బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్ నమాజ్ ను కొత్తగూడెం ఈద్గ లో ఉదయం 8: 00 నిర్వహిస్తున్నట్లు ఈద్గ హడహక్ కమిటీ భాధ్యులు యంఏ. రజాక్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతో కొత్తగూడెం మున్సిపాలిటీ, స్థానిక పంచాయతీ అధికారుల సమన్వయంతో కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఈద్ నమాజ్ నిర్వహించుటకు ఏర్పాటు చేశామని రజాక్ తెలిపారు. ఈద్ నమాజ్ కు వచ్చే ముస్లిం సోదరులు తమ తమ జానీమాజ్ ను వెంట తీసుకొని రావాలని కోరారు. ఈద్ నమాజ్ ను హఫీజ్ మహ్మద్ రఫీఉద్దీన్ నిర్వహిస్తారని పోలీస్ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు, సోదరులు అందరు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అహలే సున్నత్ జమాత్ జిల్లా అధ్యక్షుడు అమీర్ ఖాద్రి, ప్రథాన కార్యదర్శి యఖుబ్ ఖాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉర్దూ ఘర్ ఛైర్మన్ యస్కే అన్వర్ పాష, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమర్, మహ్మద్ హుస్సేన్ ఖాన్, సయ్యద్ జానీ, యఖుబ్ పాష, మహ్మద్ అలీ, అస్లాం, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.