రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం ఈద్గ లో రంజాన్ పండుగ నమాజ్ నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అహలే సున్నత్ జమాత్ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ఈద్గ & ఖబ్రిస్తాన్ మేనేజింగ్ కమిటీ భాథ్యులు యం. ఏ. రజాక్ శుక్రవారం తెలిపారు. కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతో పండుగ ఏ రోజు జరిగిన సరే ముస్లిం ప్రజనికానికి ఈద్గ లో నమాజ్ కోసం ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రజాక్ తెలిపారు. కొత్తగూడెం ఈద్గ లో ఉదయం 8: 30 నిమిషాలకు నమాజ్ ప్రారంభం అవుతుందని మహ్మద్ రఫీ ఉద్దీన్ ఇమామ్ గా వ్యవహరిస్తారని కమిటీ భాధ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో అహలే సున్నత్ జమాత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉర్దూ ఘర్ ఛైర్మన్ యస్కే. అన్వర్ పాష, అహలే సున్నత్ జమాత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, కొత్తగూడెం మున్సిపాల్ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ యఖుబ్, అహలే సున్నత్ జమాత్ జిల్లా ప్రథాన కార్యదర్శి యఖుబ్ ఖాద్రి, అహలే సున్నత్ జమాత్ జిల్లా ఉపాధ్యక్షులు మహ్మద్ గౌస్, మోయినుద్దీన్, అహలే సున్నత్, జమాత్ సెక్రటరీ జనరల్ మహ్మద్ అలీమ్ ఉద్దీన్, అడ్వకేట్ మహ్మద్ సాదిక్ పాషా, అమీర్ ఖాద్రి, హుస్సేన్ ఖాన్, సయ్యద్ యఖుబ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.