జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాదీని కొత్తగూడెం కలేక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో అహలే సున్నత్ జమాత్ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యం. ఏ. రజాక్ వారి ప్రతినిధి బృందంతో కలిసి ముస్లిం మైనార్టీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కమిషన్ సభ్యురాలు సంబంధిత అధికారులను సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అహలే సున్నత్ జమాత్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు అమీర్ ఖాద్రి, సహయ కార్యదర్శి మహ్మద్ గౌస్ ఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ యస్కే. అన్వర్ పాష, మహ్మద్ ఫేరోజ్ హుస్సేన్, జిల్లా అధికార ప్రతినిధి అడ్వకేట్ మహ్మద్ సాదిక్ పాషా, రామవరం శాఖ కార్యదర్శి మహ్మద్ షమీ, కో ఆప్షన్ సభ్యులు ఆరీఫ్ ఖాన్, ఉర్దూఘర్ కమిటీ సభ్యులు సయ్యద్ జానీ, ఖయ్యుం, తదితరులు పాల్గొన్నారు.