గురువారం పాల్వంచ నెహ్రూనగర్ నారాయణ పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూరేటి నరసింహారావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు తదుపరి అయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ, మన భారతదేశ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసేందుకు నేటి తరం విద్యార్థులు కంకణం కట్టుకొని కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు జరుపుకుని ముంగించారు.