చర్ల మండలంలో గోండ్వానా సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీలోకి చట్ట విరుద్ధంగా వలసలు వచ్చిన గిరిజనేతరులకు ఏ చట్టం ప్రాతిపదికన ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. అసలైన ఆదివాసీలకు ప్రభుత్వ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.