చర్ల మండల ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మంగళవారం పంపిణీ చేశారు. ఆడబిడ్డల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.