భద్రాచలంకి కొద్ది దూరంలో ఉన్న సెంటెన్స్ స్కూల్ వద్ద గోశాల నిర్మించిన రాముల వారి భూమి ప్రతిరోజు మందుబాబులకు అడ్డాగా మారింది. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంతో కాపల ఎవరూ లేకపోవడంతో మందుబాబులు ప్రతిరోజు అడ్డాగా ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. దేవస్థానం అధికారులు మందుబాబులను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.