దమ్మపేటలో జీసీసీలో హమాలీగా పనిచేస్తున్న బోగి సత్యం, అంగన్వాడీ కార్యకర్త బోగి రమణ దంపతుల పెద్ద కుమార్తె సమ్మక్క 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం, గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ సాధించి శభాష్ అనిపించుకుంది. శుక్రవారం సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమ్మక్క తెలిపారు.