ఈనెల 30న జరిగే సీపీఎం మండల మహాసభను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. బుధవారం చంద్రుగొండ పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వాలని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.