ఆర్థిక వ్యవహారాల్లో అక్షరాస్యత, ఆదాయ లావాదేవీల్లో సమతుల్యమైన అవగాహన ఎంతైనా అవసరం అని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వి. రామిరెడ్డి అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో స్థానిక విద్యార్థులకు అసోసియేట్ డీన్ అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల్లో అప్రమత్తత, పెరుగుతున్న సైబర్ క్రైం నుంచి జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.