కేవలం లైబ్రరీలో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాగజ్ నగర్ పట్టణంలో ప్రజాబంధు పాల్వాయి పురుషోత్తం స్మారక లైబ్రరీ రీడింగ్ రూమ్లో చదువుకుని పట్టణానికి చెందిన కృష్ణంరాజు, శ్రీకర్, రాజశేఖర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. నిరుద్యోగ యువత కష్టపడి అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.