కాగజ్నగర్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో ఆదివారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ డివిజన్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పులు జరగకుండా త్వరిత గతిన సర్వేను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.