సిర్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై మంగళవారం పిసిసి అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రికి సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జి రావి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో సిర్పూర్ నియోజకవర్గంలో పలు సమస్యలు పై పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు, ఉప ముఖ్యమంత్రి బట్టివిక్రమార్కకు వినతిపత్రం అందజేస్తూ సమస్యలను వివరించారు. వారు సానుకూలంగా స్పందించినట్లు రావి శ్రీనివాస్ తెలిపారు.