వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన సిర్పూర్ టీ ప్రభుత్వ ఆసుపత్రి నేడు డాక్టర్లు లేక వెలవెలబోతోందని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆసుపత్రిని సందర్శించి మాట్లాడారు. గ్రామాల నుంచి వచ్చే పేషెంట్లుకు సరైన వైద్య సదుపాయం లేక మృత్యువాత పడుతున్నారని, ఆరు గ్యారంటీలు వద్దు, ముందు ప్రజల ఆరోగ్యాల గురించి వారి ప్రాణాల గురించి పట్టించుకోండని డిమాండ్ చేశారు.