డీజీపీ చేతుల మీదుగా ఆసిఫాబాద్ సీఐ ఆకుల అశోక్ కు ప్రశంసా పత్రం
మంచిర్యాల్ రూరల్ సీఐ ఆకుల అశోక్ గతంలో ఆసిఫాబాద్ పట్టణ పోలిస్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న నిందితుడిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా సాక్షుల విచారణ అనంతరం గౌరవ మేజిస్ట్రేట్ నిందితుడికి 5 సం. ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడమైనది. శనివారం హైదరాబాద్లో ఉత్తమ ప్రతిమ కనబరిచిన సీఐ ఆకుల అశోక్ ను తెలంగాణ రాష్ట్ర డీజీపి డా. జితేందర్ ఐపీఎస్ ఆభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు.