కాగజ్నగర్ మండలం ఇస్గాం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బషీరుద్దీన్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ లో అంత్యక్రియలు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడు ఉంటుందని, తక్షణ సహాయం కింద వారి కుటుంబ సభ్యులకు 20వేలు అందజేశారు.