ఆసిఫాబాద్ మండలంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ ఇటీవలే ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా 17 మంది బదిలీ కాగా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్ధులు గురువారం తమ బాధను వివరించారు. మా భవిష్యత్తు ఏంటని, తరగతులు బహిష్కరించి స్కూల్ నుండి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు విద్యార్థులు బయలుదేరారు. ఈ సందర్భంగా తమకు వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.