బెజ్జూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. మండల సర్మిడి మాట్లాడుతూ, మానవునికి కానీ, దేవతలకు, రాక్షసులకు కానీ పుట్టుక, చావు ఒకసారి ఉంటుందని అన్నారు. కానీ మా యొక్క మూలపురుషుడు రావణునికి ప్రతి సంవత్సరం దహన కార్యక్రమం చేయడం ఆదివాసులని కించపరిచినట్లేనని అన్నారు. సమావేశంలో రాయి సెంటర్ సభ్యులు, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.