ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్ గురువారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో మంత్రులు బట్టి విక్రమార్క, సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని సమస్యలను, అభివృద్ధి పనులను వివరించారు.