చింతకాని మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్లయ్య అక్రమ అరెస్టుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. శుక్రవారం ప్రొద్దుటూరులో జరిగిన సభలో పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఏమైందో పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరు పోలీస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఏపీ తరహా పరిణామాలు ఎదుర్కోవటానికి పోలీసులు సిద్ధంగా ఉండాలంటూ మాజీ మంత్రి హెచ్చరించారు.