ఖమ్మంలోని కాల్వవొడ్డులో చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయగా, ప్రారంభంలో బాగానే కొనసాగింది. కానీ ఇప్పుడు వ్యాపారులకు గిరాకీ సరిగా రాకపోవడంతో పాటు, సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడ కూరగాయలు అమ్మకుండా రోడ్డు వెంటే క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.