సీసీఐ కోనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో పత్తిని తిరిగి వెనక్కి పంపొద్దని, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గుర్రం అచ్చయ్య అన్నారు. గురువారం తల్లాడలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతుల సాధక బాధల గురించి విన్నారు. రైతులు తెచ్చిన పత్తిని అవసరమైతే తమ దగ్గర దించుకొని తేమ శాతం వచ్చిన తర్వాత కాంటా వేసుకొని రైతులకు సౌకర్యంగా ఏర్పాట్లు చేయాలన్నారు.