సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును రవాణాశాఖ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఖమ్మంలోని శ్రీ చైతన్య పాఠశాల పేరిట బస్సు రిజిస్టర్ అయి ఉండగా, 60 కి. మీ. పరిధిలోనే నడపాల్సి ఉంటుంది. కానీ సత్తుపల్లి విద్యాలయం అవసరాలకు అనుమతి లేకుండా వినియోగిస్తున్నారు. ఈ మేరకు పర్మిట్ నిబంధనలు అతిక్రమించినట్లు తేలడంతో సీజ్ చేయడమే కాక కేసు నమోదు చేశామని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.