కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అన్ని రంగాల్లో విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాపారావు విమర్శించారు. గురువారం సత్తుపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ చార్జ్ షీట్ విడుదల చేయనున్నామని తెలిపారు. నాయకులు రమేష్, నాయుడు రాఘవరావు ఉన్నారు.