బీజెపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. సోమవారం కల్లూరు మండలంలోని పుల్లయ్య బంజరలో జరిగిన సమావేశంలో హాజరై మాట్లాడారు. మహా సంపర్క అభియాన్ లో భాగంగా గ్రామస్థాయి నుంచి పార్టీ శక్తిని పెంపొందించడానికి, ప్రజలతో నేరుగా సంబంధం కల్పించుకోవడం, వారికి పార్టీ విధానాలను అవగాహన చేయడం, నూతన సభ్యులను చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.