మణుగూరు: వసతి గృహాల్లో మెనూ పాటించడం లేదు
మణుగూరు పట్టణంలోని బాలికల వసతి గృహంలో విద్యార్థులకు మెనూ పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వసతి గృహాన్ని సందర్శించి సమస్యలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కాస్మెటిక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. హాస్టల్కు వస్తున్న పరుపులు మాయమవుతున్నాయని చెప్పారు. కావున అధికారులు తగిన స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.