కరకగూడెం: పేద ప్రజలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుంది
పేద ప్రజలు ఉన్నంతవరకు ఎర్రజెండా వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటుందని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. సోమవారం కరకగూడెం మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.