మనోవేదనతో పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పినపాక రాయిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. ఏడూళ్లబయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంకీర్తన(24) బీటెక్ పూర్తి చేశారు. ఉద్యోగావకాశాలు రాకపోవడంతో మనోవేదనకు గురై పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వైద్యశాలకు తరలించగా చికిత్సపొందుతూ సోమవారం ఆమె మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.