కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మీద రాతల్లాగా మారిపోయాయని, ఆచరణలో అమలయ్యే పరిస్థితి లేకుండాపోయిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. సోమవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తిగా చెయ్యలేదన్నారు. ఇళ్లను కూల్చే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.