వ్యవసాయ కూలీలకు జీవనభృతి కింద రూ. 12 వేలు చెల్లించాలని ఏఐపీకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య అన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలో పాలేరు డివిజన్ అధ్యక్షుడు సోమనపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఈనెల 20 నుంచి డిసెంబర్ 2 వరకు విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.