నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఓ టీ స్టాల్ వద్ద పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బుధవారం పార్టీ కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ సరదాగా కాసేపు గడిపారు. అక్కడ ప్రతి కార్యకర్తను పేరు పేరునా పిలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పున్నం బ్రహ్మయ్య, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.