నేలకొండపల్లి: ప్రభుత్వ ఆసుపత్రికి మందుల వితరణ

53பார்த்தது
పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పాటుపడుతుందని ఆ పార్టీ జిల్లా నాయకులు పసుమర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన రూ. 50 వేల విలువైన మందులు కొనుగోలు చేసి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు పేద ప్రజల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி